R10

🌺 దేవుడు నీలోనే ఉన్నాడు 🌺

⚜️ “మానవుడు దేనినైతే వెతుకుతున్నాడో అది అతడికి అతి సమీపంలోనే ఉంది. ఐనా అతడు దానిని అక్కడాయిక్కడా వెతుకుతుంటాడు.”

⚜️ “ఒకడు చుట్ట కాల్చుకోవాలని అనుకున్నాడు. నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి అవడంవల్ల అందరూ గాఢనిద్రలో మునిగి ఉన్నారు. వాడు మొదట పిలిచాడు. తలుపు తట్టాడు. ఎవరూ పలుకలేదు. తరువాత తలుపుని బాదడం మొదలు పెట్టాడు.

⚜️ ఆ శబ్దానికి లేచి లోపలి నుంచి ఎవరో వచ్చి తలుపుతీసి చూచారు. ఎదురుగా ఈ మనిషి కనపడ్డాడు. అతణ్ణి చూడటంతోనే, ‘ఏమిటండీ! సంగతేమిటి? ఇంత రాత్రివేళ ఇలా వచ్చారు?’ అని ప్రశ్నించారు. ఆ ధూమపానప్రియుడు వెంటనే, ‘ఆ మాత్రం ఊహించలేవటయ్యా! చుట్ట కాల్చటమంటే నాకెంత ప్రాణమో నీకు తెలియదా? అందుకే చుట్ట వెలిగించుకోవడానికి నిప్పు అడుగుదామని వచ్చాను” అని బదులు చెప్పాడు.

⚜️ అప్పుడు ఆ పొరుగువాడు బిగ్గరగా నవ్వుతూ, “మీరు భలేవారండీ! దీని కోసమేనా ప్రయాసపడి ఈ అర్ధరాత్రి ఇంతదూరం వచ్చి తలుపు బాదుతూ ఉన్నారు? వెలుగుతున్న లాంతరు మీ చేతిలోనే ఉంది కదా!’ అన్నాడు.”

⚜️ “దేవుడు ‘అక్కడ, అక్కడ’ (అంటే ఎక్కడో ఎంతో దూరంలో) ఉన్నాడని తలుస్తున్నంతవరకూ మానవుడు అజ్ఞానంలో ఉంటాడు. భగవంతుడు “ఇక్కడ, ఇక్కడ’ (అంటే తనలోనే) ఉన్నాడని తెలుసుకుంటే జ్ఞానాన్ని పొందినవాడౌతున్నాడు.”

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

https://srinivasanper.blogspot.com
https://sriramakakaji.blogspot.com
PRESSLINK

1 Kings 11: 2
Of the nations concerning which the LORD said unto the children of Israel, Ye shall not go in to them, neither shall they come in unto you: for surely they will turn away your heart after their gods: Solomon clave unto these in love. Amen!!

Published by S Truth

Song of Solomon 1: 15 Behold, thou art fair, my love; behold, thou art fair; thou hast doves' eyes.Amen!!

Leave a comment

Design a site like this with WordPress.com
Get started